మంగళవారం, డిసెంబర్ 22, 2015

ఒక ఆడపిల్లను రాత్రంతా బస్సులో ఢిల్లీ నడి వీధుల్లో తిప్పుతూ అతి కిరాతకంగా ఒకరి వెంట ఒకరు హత్యాచారమ్ చేస్తూ, మానంలో ఇనుపరాడ్లు, బీరు బాటిల్లు చొప్పించి ప్రేగులను సైతం మానంలో నుండే బయటికి లాగి అతికిరాతకంగా అనుభవించిన పైశాచిక రాక్షసులలో ఒకడ్ని మన దేశం వదిలి పెట్టి, వాడికి జీవనభృతి కలిపిస్తూ, రక్షణ వ్యవహారాలను నిర్వహిస్తున్న మన దేశ చట్టాలపై గౌరవం పోయింది. వాడి కోసం వాదిస్తున్న న్యాయ వ్యవస్థను చూసి వాళ్ళకు సిగ్గు లేకపోయినా ఇలాంటి దేశంలోనా నేనున్నది అని సిగ్గుతో కుమిలిపోతున్నాను. కోర్టులో న్యాయ దేవత కళ్ళకు గంతతో పాటు హృదయం కూడా లేదు అనే విధంగా చూపిస్తే ఎంత బాగున్ణు. వయస్సు కొంత తక్కువైతే అమ్మాయిలను ఎలాగైనా చీల్చి చెందాడవచ్చన్న మాట. పెద్దగా శిక్షలు లేని చట్టాలు మనవి. విపరీతమైన బొక్కలతో నిందియున్న చట్టాలు మనవి. ఈ పనికి రాని చట్టాలు చూసి సిగ్గు వేస్తుంది. ఒక ఆడపిల్లకు సరైన న్యాయం చేయలేని చట్టాలు ఉన్నా ఒకటే! తగల బెట్టినా ఒకటే.. నేను సిగ్గుపడుతున్నాను...దేవుడా ఇటువంటి దేశమా? నా భారతదేశం అని!!!

2 కామెంట్‌లు:


  1. ంఆఈణాౠఖీ 18సం; వరకుCORRECTIONHOMEలోఉంచి వాడి నేరం ఏదైనా విడిచిపెట్టవలసిందే.అది చట్టం.ఇతరదేశాలోకూడా ఇంతే.అందువలన మనం మన దేశం గురిణి సిగ్గు పడవలసిన అవసరం లేదు.కాని ఈ చట్టాన్ని పార్లమెంటు ద్వారా మార్చుకోవచ్చును.

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts